కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఉప్పు దాసు, విదేశీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లక్షమంది దరఖాస్తు చేసుకున్న మానస సరోవర్ యాత్రకు ఎంపికయ్యారు. ఢిల్లీలో జరిగిన లక్కీ డ్రాలో ఆయనకు లాటరీ తగలడంతో, చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న కైలాస మానస సరోవర్ యాత్రకు ప్రయాణమయ్యాడు. మాజీ సైనికుడిగా దేశానికి సేవలందించి, ప్రస్తుతం శివుడి భక్తుడిగా ఉన్న దాసు ఎంపికతో జిల్లెల్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ యాత్రకు ఆయన 2025 జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు.