
కొల్లాపూర్: గంగమ్మ తల్లికి ఘనంగా బోనాలు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గంగమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు తలపై బోనాలు ఎత్తుకొని డప్పుల మేళం, భక్తి నాదాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

































