బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

1025చూసినవారు
బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో BKR ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ సోమవారం  నిర్వహించారు. ఈ క్యాంపునకు హాజరైన చైర్పర్సన్ వాకిటి మానస, బీఎస్సీ నర్సింగ్ అనుభవంతో రోగులను పరీక్షించి వైద్య వృత్తిపై గౌరవం తెలిపారు. ప్రజాసేవలో బాలకృష్ణారెడ్డి లక్షల రూపాయల సొంత ఖర్చుతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం గొప్ప విషయమని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్