మంత్రి శ్రీహరి కాన్వాయ్ వాహనం బోల్తా: నలుగురికి గాయాలు

1000చూసినవారు
మంత్రి శ్రీహరి కాన్వాయ్ వాహనం బోల్తా: నలుగురికి గాయాలు
నారాయణపేట జిల్లా, మక్తల్ లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కాన్వాయ్ లోని బాంబు స్క్వాడ్ వాహనం బుధవారం బోల్తా పడింది. ఉట్కూర్ మండలంలో శంకుస్థాపనల కార్యక్రమాలకు మంత్రి బయలుదేరగా, ఉప్పరపల్లి గేట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనంలోని నలుగురు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.