మక్తల్ పట్టణంలోని నారాయణపేట చౌరస్తాలో బీఆర్ఎస్ జెండా కట్టపై చెప్పు బొమ్మ వేసిన దుండగులను వెంటనే శిక్షించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎస్ఐ రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.