అంబరాన్నంటిన ఏరువాక సంబరాలు

2021చూసినవారు
అంబరాన్నంటిన ఏరువాక సంబరాలు
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని యాదవ్ నగర్లో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఏరువాక తాడును తెంపడానికి పోటీపడి, తమ జీవాలను అలంకరించి ఊరేగించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు రైతులకు మువ్వలు అందజేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్