కొమ్మలు నరికే సాకుతో చెట్ల నరికివేతపై పర్యావరణ ప్రేమికుల ఆందోళన

280చూసినవారు
కొమ్మలు నరికే సాకుతో చెట్ల నరికివేతపై పర్యావరణ ప్రేమికుల ఆందోళన
నారాయణపేట జిల్లా, మక్తల్ నియోజకవర్గంలో విద్యుత్ శాఖ సిబ్బంది కొమ్మలు నరికే సాకుతో చెట్లను పూర్తిగా నరికివేస్తున్నారని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగంబండ గ్రామానికి వెళ్లే రహదారిలో దాదాపు 40 చెట్ల కొమ్మలు నరికివేయగా, 8 చెట్లను పూర్తిగా నరికివేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొక్కలు నాటుతుంటే, అవి పెరిగిన వెంటనే నరికివేయడం అలవాటుగా మారిందని, ఇది మొక్కలు పెంచే ఉద్దేశాన్ని నీరుగారుస్తుందని వారు పేర్కొన్నారు. అటవీ, విద్యుత్ శాఖ అధికారులు ఒక అవగాహనకు రావాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్