మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి పోక్సో కేసులో రిమాండ్ ఖైదీ కిశోర్ కుమార్ (22) సోమవారం పరారయ్యాడు. జైలులో క్యాంటీన్లో పని చేస్తూ, టవల్స్ ను ముడివేసి గోడ దూకి తప్పించుకున్నట్లు సమాచారం. వనపర్తి జిల్లా సఖి కేంద్రంలో ఉన్న ప్రియురాలీని కలిసేందుకు గోడ దూకి పారిపోయాడు. పోలీసులు పరారీలో ఉన్న ఖైదీ కోసం గాలిస్తున్నారు. అతను అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన వాడు.