మాజీ ఎమ్మెల్యే అపోహలు సృష్టిస్తున్నారు: కౌన్సిలర్

1873చూసినవారు
మాజీ ఎమ్మెల్యే అపోహలు సృష్టిస్తున్నారు: కౌన్సిలర్
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అపోహలు, గొడవలు సృష్టించి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని 12వ వార్డు కౌన్సిలర్ రహీం పటేల్ ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం మక్తల్ మున్సిపాలిటీ 12 వార్డులో కిరణం షాపులో కూర్చుని SIR రాస్తారా అంటూ BLO లపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహించడంపై ఆయన మండిపడ్డారు. 7, 11, 12 12వ వార్డులలో ఓట్లు తొలగించడానికి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గందరగోళాలు సృష్టించే విషయమై పునరాలోచన చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్