నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం మహా పూజ కోసం నూతన షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక నిధులతో ఈ నిర్మాణం జరుగుతోంది. జనవరి 1న మహా పూజ నాటికి షెడ్డు అందుబాటులోకి వస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.