నారాయణపేట జిల్లా, మక్తల్ పరిధిలోని కృష్ణ మండలం వాసు నగర్ క్యాంపుకు చెందిన ముడుమాల నాగరాజ్ అనే వ్యక్తి కృష్ణా నది వంతెన పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.