రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

854చూసినవారు
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
నారాయణపేట జిల్లా కృష్ణ రైల్వే వంతెనపై ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి బస్వరాజ్ అనే వ్యక్తి మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా కొల్లూర్ గ్రామానికి చెందిన బస్వరాజ్, కృష్ణ క్షీర లింగేశ్వర దర్శనానికి రైలులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. వంతెనపై నుంచి జారిపడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్