మారెమ్మ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

1869చూసినవారు
మారెమ్మ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు
నారాయణ పేట జిల్లా మఖ్తల్ మున్సిపాలిటీ 2వ వార్డు దండు గ్రామంలో మారెమ్మ బోనాల జాతర సందర్భంగా మంగళవారం  మంత్రి వాకిటి శ్రీహరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని సన్మానించి, తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. అనంతరం మంత్రి గ్రామస్తులకు అమ్మవారి బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్