కాంగ్రెస్ నాయకుడు శాంతి కుమార్ ను పరామర్శించిన మంత్రి వాకిటి

958చూసినవారు
కాంగ్రెస్ నాయకుడు శాంతి కుమార్ ను పరామర్శించిన మంత్రి వాకిటి
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కటిక శాంతి కుమార్ రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వాకిటి శ్రీహరి, రాయచూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శాంతి కుమార్ ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్