నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో చిన్నారికి పోలియో చుక్కలు వేసి ఆమె ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.