ఆలంపల్లి గ్రామంలో విషాద వాతావరణంలో కోనేటి కిరణ్ కుమార్ (24) అంతిమయాత్ర మంగళవారం జరిగింది. ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి బ్రెయిన్ డెడ్ అయిన కిరణ్ కుటుంబ సభ్యులు, తీవ్ర విషాదంలోనూ అతని అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. వైద్యులు గుండె, కిడ్నీలు, కాలేయాన్ని సేకరించి నలుగురు రోగులకు అమర్చారు. మరణానంతరం కూడా నలుగురికి ప్రాణదాతగా నిలిచిన కిరణ్ సేవలను గ్రామస్తులు కొనియాడారు.