నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో జాతీయ జెండాలకు అవమానం జరిగింది. స్థానిక పాఠశాల పక్కన చెత్తకుప్పలో జాతీయ జెండాలు కనిపించాయి. గణతంత్ర దినోత్సవం తర్వాత తీసిన అలంకరణ జెండాలను చెత్తలో పడేసినట్లు తెలుస్తోంది. సమీపంలోని మూడు పాఠశాలలు తమకు సంబంధం లేదని చెప్పాయి. ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.