రైతుల చేతిలో రోడ్డు ధ్వంసం: బైరంపల్లి వాసుల ఆవేదన

657చూసినవారు
రైతుల చేతిలో రోడ్డు ధ్వంసం: బైరంపల్లి వాసుల ఆవేదన
నారాయణపేట జిల్లా, మక్తల్ పరిధిలోని మాగనూరు మండలం నేరడగం నుండి బైరంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డును కొందరు రైతులు తమ పొలాలకు అనుకూలంగా లేదనే కారణంతో ఉద్దేశపూర్వకంగా తవ్వేశారు. ఈ రోడ్డు నక్షలో ఉన్నప్పటికీ, నేరడగం రైతుల చర్యల వల్ల తమ గ్రామానికి రోడ్డు లేకుండా పోతుందని బైరంపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బిఆర్ఎస్ హయాంలో అప్పటి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఈ రోడ్డుకి భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్