వేడి గంజిలో పడి మూడేళ్ల బాలిక మృతి

741చూసినవారు
వేడి గంజిలో పడి మూడేళ్ల బాలిక మృతి
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గుడేబల్లూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో అన్నం వండుతున్న సమయంలో, ఇంటి ముందు ఆడుకుంటున్న బోల్ల నందిని (3) అనే బాలిక ప్రమాదవశాత్తు వేడి గంజిలో పడి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే రాయచూర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్