భూ పోరాటంతో కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని TRS డిమాండ్

1022చూసినవారు
భూ పోరాటంతో కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని TRS డిమాండ్
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ TRS ఇంచార్జ్ సిహెచ్ వెంకటన్న, జూలై 2న ఉప్పల్ భగాయత్ లో నిర్వహించనున్న భూ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల కుటుంబాలు, కళాకారులకు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి, 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన సరికాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో TRS మక్తల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్