కాలువ నీరు వెళ్లేందుకు పనులు ప్రారంభం

1828చూసినవారు
కాలువ నీరు వెళ్లేందుకు పనులు  ప్రారంభం
నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీ 4వ వార్డ్ లో డొంగుల ఆంజనేయస్వామి దారి నుండి కాలువ నీరు ఖానాపూర్ చెరువులోకి వెళ్లే మార్గం ఇబ్బందికరంగా ఉందని స్థానిక రైతులు మంత్రి వాకిటి శ్రీహరికి తెలిపారు. స్పందించిన మంత్రి తన సోదరుడు శేషగిరికి సూచించగా, ఆయన జెసిబి తో కాలువ పూడికతీత పనులు ప్రారంభించారు. ఈ సహాయానికి రైతులు మంత్రికి, ఆయన సోదరుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు పీకే నర్సింహా వెంకటేష్, కుర్వ లింగం, మరియు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్