
నాగర్ కర్నూలు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. సూసైడ్ నోట్ కలకలం
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో, కొల్లాపూర్ నియోజకవర్గం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన స్ఫూర్తి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతోంది. తోటి విద్యార్థులు గమనించి వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.




































