అచ్చంపేట: ఉచ్చులో పడి చుక్కల దుప్పి మృతి

964చూసినవారు
అచ్చంపేట: ఉచ్చులో పడి చుక్కల దుప్పి మృతి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం మాదారారం బీట్ సమీపంలో శనివారం ఓ చుక్కల దుప్పి మృతి చెందింది. వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిక్కుకోవడంతో దుప్పి ప్రాణాలు కోల్పోయిందని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు దుప్పి కళేబరాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. వన్యప్రాణుల వేటకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీట్ ఆఫీసర్ తెలిపారు.