నాగర్ కర్నూల్: తుఫాన్ ఎఫెక్ట్... 30 గొర్రెలు మృతి

1440చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లాలోని తాడూరు మండలంలో ఐతోల్ గ్రామానికి చెందిన తాండ్ర ముసలయ్య అనే రైతుకు చెందిన 30 గొర్రెలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గురువారం మృతి చెందాయి. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గొర్రెలు తడిసిపోయి, గురువారం ఒక్కసారిగా మృత్యువాత పడ్డాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రైతు, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కన్నీటితో వేడుకున్నాడు.

సంబంధిత పోస్ట్