బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో డీసీఎం, కారు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై నారాయణపూర్ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం, ఆమన్ గల్ నుంచి కల్వకుర్తి వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చరికొండ గ్రామానికి చెందిన వల్లబుదాస్ వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై కురుమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.