యోగాపై రీల్స్ పోటీ: రూ.10 వేల బహుమతి గెలుచుకోండి

91చూసినవారు
యోగాపై రీల్స్ పోటీ: రూ.10 వేల బహుమతి గెలుచుకోండి
నాగర్ కర్నూల్: యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, మైగవ్‌ సంయుక్తంగా 'రీల్‌ కాంటెస్ట్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యోగా 2026' పేరుతో రీల్స్ పోటీలను నిర్వహిస్తున్నాయి. యోగాపై అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆసక్తిగలవారు తమ ఒరిజినల్ యోగా రీల్‌ను ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ లేదా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి, ఆ లింక్‌ను మైగవ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులకు గడువు ఉంది. అత్యుత్తమ సృజనాత్మకత, సందేశాత్మకత కలిగిన పది రీల్స్‌ను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు.

సంబంధిత పోస్ట్