క్రిశాంక్ పై రూ. కోటి పరువు నష్టం దావా వేస్తా: మల్లు రవి

642చూసినవారు
తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె క్రిశాంక్ పై నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధారమైన ఆరోపణలతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఎంపీ మాట్లాడుతూ, క్రిశాంక్ పై రూ. కోటి పరువు నష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని, చట్ట పరంగా దీనిని ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్