నాగర్ కర్నూల్: సంపులో పడి యువ రైతు మృతి

69చూసినవారు
నాగర్ కర్నూల్: సంపులో పడి యువ రైతు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన రైతు గుంటి బంగారయ్య (38) ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. ఆదివారం రోజువారీగా పొలం దగ్గర ఉన్న సంపులో మోటారు ఆన్ చేసేందుకు వెళ్లగా మోటారు నడవలేదు. దీంతో ఆ మోటారును సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి సంపులో పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Job Suitcase

Jobs near you