నారాయణపేట జిల్లాలో 108, 102 అత్యవసర వైద్యసేవలు ప్రాణాలను కాపాడుతున్నాయి. గర్భిణులు, బాలింతలను ఆసుపత్రులకు తరలించడంలో 102 వాహనాలు, రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో 108 అంబులెన్సులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో 108 వాహనాలు 10, 102 వాహనాలు 8, జిల్లా కేంద్రంలో ఒక మాతా శిశు అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసిన వెంటనే స్పందించి, క్షతగాత్రులను, గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్న ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సూపర్వైజర్ రాఘవేంద్ర శనివారం సూచించారు.