బాడీ బిల్డింగ్ సత్తాచాటిన నారాయణపేట జిల్లా వాసి

548చూసినవారు
సికింద్రాబాద్‌లో ఆదివారం జరిగిన మిస్టర్ తెలంగాణ-2026 బాడీబిల్డింగ్ పోటీల్లో నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామానికి చెందిన శెట్టి ప్రేమ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. మారుమూల గ్రామం నుంచి విజేతగా నిలవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, పలువురు నాయకులు ప్రేమ్ కుమార్‌ను అభినందించారు.

సంబంధిత పోస్ట్