రైతు చట్టాలపై అవగాహన సదస్సు: లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సూచనలు

115చూసినవారు
రైతు చట్టాలపై అవగాహన సదస్సు: లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సూచనలు
నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు, ఉట్కూరు మండలం తిప్రస్పల్లి గ్రామంలో రైతు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ, రైతులు రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎరువులు, క్రిమిసంహారక మందులు లైసెన్స్ ఉన్న దుకాణాల నుండే కొనుగోలు చేసి రషీదు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలతో పంట నష్టపోతే వినియోగదారుల ఫోరం ద్వారా నష్టం పొందే అవకాశం కోల్పోతారని ఆయన హెచ్చరించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె సురేష్ గారు రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్