హనుమాన్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం: కలెక్టర్ ప్రణయ్ కుమార్ హాజరు

201చూసినవారు
హనుమాన్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం: కలెక్టర్ ప్రణయ్ కుమార్ హాజరు
ధన్వాడ మండలంలోని మందిపల్లి గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం మందిపల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్, రక్తదానం అత్యంత గొప్పదని, అత్యవసర సమయాల్లో రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రక్తదానం ద్వారా సమాజంలో సేవా భావం పెరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారిని నిర్వాహకులు విష్ణువర్ధన్ రెడ్డి, రాఘవేందర్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్ రెడ్డి, కిష్టాపూర్ సర్పంచ్ కొండయ్య, ఉప సర్పంచ్ నరేష్, అనిల్ కుమార్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్