తెలంగాణ జాతిపిత కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, కోటకొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేసుల పేరుతో కేసీఆర్ ను వేధిస్తున్నారని, పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేపూరి రాములు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిపై కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీ.మల్లేష్, కార్యదర్శి కుర్మేష్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.