అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని విసిగి చెందిన సీతారాం రెడ్డి అనే ఫిర్యాదుదారుడు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు ఎంఈఓ, డీఈఓలపై కూడా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక ఫీజుల భారం మోస్తున్నారని ఫిర్యాదుదారుడు తెలిపారు.