నారాయణపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దామోదర్ గౌడ్ ఆరవసారి విజయం సాధించారు. రాజేశ్వర్ గౌడ్ ప్యానల్ పై దామోదర్ గౌడ్ ప్యానల్ వరుసగా ఆరోసారి గెలుపొందింది. ఉపాధ్యక్షులుగా నందు నామాజీ, జనరల్ సెక్రటరీగా చెన్నారెడ్డి, జాయింట్ సెక్రటరీగా అమీరుద్దీన్ ఎన్నికయ్యారు. తనను గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపిన దామోదర్ గౌడ్, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.