నారాయణపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఎస్. శ్రీను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమం కోసం NPRD చేస్తున్న కృషిని అదనపు కలెక్టర్ అభినందించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ ఫలాలను సకాలంలో అందించడానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో NPRD జిల్లా నాయకులు పాల్గొన్నారు.