నారాయణపేట జిల్లా, మద్దూర్ మండల కేంద్రంలో అంబాభవాని అమ్మవారి దేవాలయ భూమి పూజ కార్యక్రమం ఏప్రిల్ 1న జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అమ్మవారి పూజ అనంతరం భూమిపూజా కార్యక్రమంలో హాజరయ్యారు. దేవాలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. దేవాలయ నిర్మాణానికి తనవంతు సహాయం చేస్తానని డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలు, దేవాలయ కమిటీ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.