నారాయణపేట జిల్లా, కోటకొండ గ్రామంలోని హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ (HWCS) సంఘానికి జరిగిన ఎన్నికల్లో కెంచె శ్రీనివాసులు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో, తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్న తర్వాత, శ్రీనివాసులు అధ్యక్షుడిగా, కెంచె నారాయణ ఉపాధ్యక్షుడిగా, ఎంగలి రఘు రాములు కార్యదర్శిగా, సాక బాలప్ప కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ అధికారి శరత్ పర్యవేక్షించారు.