నారాయణపేట జిల్లాలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ కోటకొండ పాఠశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా ఎంపికైంది. వచ్చే సంవత్సరం నుండి ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా, పాఠశాల విస్తీర్ణం పరిశీలించడానికి RJD సోమిరెడ్డి కోటకొండను సందర్శించారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్దేశించిన ఫలితాలను సాధిస్తున్న ఈ పాఠశాల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో భాగంగా ఎంపికైంది.