లేబర్ ఆఫీస్ కార్మికులకు అందుబాటులో లేదు: TUCI

910చూసినవారు
లేబర్ ఆఫీస్ కార్మికులకు అందుబాటులో లేదు: TUCI
నారాయణపేట జిల్లా కేంద్రంలో లేబర్ ఆఫీస్ కార్మికులకు అందుబాటులో లేదని, ఏఎల్ఓ (ALO) అందుబాటులో ఉండటం లేదని తెలంగాణ ప్రగతిశీల మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం (TUCI) జిల్లా అధ్యక్షులు బి. నరసింహ ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు మంజూరై సంవత్సరం గడుస్తున్నా అకౌంట్లలో జమ కాలేదని, లేబర్ గుర్తింపు కార్డుల కోసం ఆన్లైన్ చేసుకుని మూడు నెలలు గడుస్తున్నా కార్డులు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. చెప్పులు అరిగేలా ఆఫీసు చుట్టూ తిరిగినా కార్మికుల సమస్యలు పట్టించుకునేవారు లేరని, పేరుకే జిల్లా అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్