శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ కేంద్రంలోని నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నామినేషన్ వేయడానికి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, హెల్ప్ డెస్క్ సిబ్బంది అభ్యర్థులకు సహకరించాలని ఆమె సూచించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, పలువురు ఆర్ఓ, ఏఆర్ఎ అధికారులతో మాట్లాడి నామినేషన్ దాఖలు సరళి వివరాలను ఆమె తెలుసుకున్నారు.