మక్తల్: హైమాస్ట్ లైట్ల వివాదం.. మాజీ ఎంపీపీపై దాడి

1101చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చేగుంట గ్రామంలో శనివారం హైమాస్ట్ లైట్ల ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ లింగప్పపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. లింగప్ప దళితుడు కావడంతోనే కక్షగట్టి దాడి చేశారని దళిత ప్రజా ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్