మక్తల్: మున్సిపాలిటీ పోరులో.. ముగ్గురు అన్నదమ్ముల సవాల్.!

30చూసినవారు
మక్తల్: మున్సిపాలిటీ పోరులో.. ముగ్గురు అన్నదమ్ముల సవాల్.!
మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వేర్వేరు పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ వార్డు ఎస్టీ రిజర్వ్ కావడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి ముగ్గురు సోదరులే నామినేషన్లు దాఖలు చేశారు. చందాపురం పంచాయతీ పరిధిలోని తిర్లాపూర్, గార్లపల్లి గ్రామాలను కలుపుకొని మక్తల్ మున్సిపాలిటీ ఏర్పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఒకే ఇంటి వారు వేర్వేరు పార్టీల తరఫున పోటీ పడటం జిల్లాలో చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్