మరికల్: ఎంపీ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

86చూసినవారు
మరికల్: ఎంపీ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
నారాయణపేట జిల్లా, మరికల్ మండలం ఎలిగండ్ల గ్రామంలో ఎంపీ డీకే అరణమ్మ గారి నిధుల నుంచి 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ అశ్విని నరేష్ గౌడ్, ఉప సర్పంచ్ వడ్డే లక్ష్మి, బీజేపీ జిల్లా నాయకులు నర్సన్ గౌడ్, మండల నాయకులు భాస్కర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, వార్డు సభ్యులు కలిసి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల నాయకులు రాజేష్ యాదవ్, వడ్డే శ్రీరామ్, రమేష్, లింగిరెడ్డి, మోహన్ రెడ్డి, ఎలిగండ్ల వార్డ్ మెంబెర్స్ బర్ల సుజాత, మోహన్, గ్రామ ప్రజలు వెంకటప్ప, ఎల్లా గౌడ్, రామ్ లింగప్ప, గురు, మహేష్, సతీష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్