నారాయణపేట: రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం

54చూసినవారు
నారాయణపేట: రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం
ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్న రకం వరి ధాన్యాన్ని బోనస్ రూ. 500 ఇస్తున్నామని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శివారెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట మండలం సింగారం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు. రైతుల నాణ్యమైన వరి ధాన్యం తేవాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్