మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కుల వివక్షను నిర్మూలించాలని, బాధితులకు సమయానికి సహాయం అందించాలని మంత్రి సూచించారు.