నారాయణపేట: క్రికెట్ ఆడిన ఎంపీ డికే అరుణ

369చూసినవారు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం మైదానంలో గురువారం ప్రధానమంత్రి ఖేల్ సంసద్ మహోత్సవ్ క్రీడా పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ క్రికెట్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. దేశంలోనే అతిపెద్ద క్రీడా పోటీలను పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామని, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే ఈ పోటీలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అరుణ కోరారు.

సంబంధిత పోస్ట్