మరికల్ మండలం రాకొండ గ్రామ సమీపంలోని గుట్టపై చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. గత మూడు రోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో చిరుత కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు, ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులు తక్షణమే బోన్లు ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు సోమవారం విజ్ఞప్తి చేశారు.