నారాయణపేట: కామన్ వర్క్ షెడ్ ను ప్రారంభించిన ఎంపీ అరుణ

878చూసినవారు
నారాయణపేట: కామన్ వర్క్ షెడ్ ను ప్రారంభించిన ఎంపీ అరుణ
నారాయణపేట జిల్లా తిర్మలాపూర్ లో శుక్రవారం ఎంపీ డీకే అరుణ తిరుమలనాథ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం, ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ. 10 లక్షలతో నిర్మించిన కామన్ వర్క్ షెడ్ ను ఆమె ప్రారంభించారు. భక్తులు, గ్రామస్తుల అభ్యర్థన మేరకు మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ ను కూడా ప్రారంభించారు. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ టవర్ నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని, త్వరలో టవర్ ఏర్పాటు చేస్తామని ఎంపీ తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్