సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు

205చూసినవారు
సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు
నారాయణపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ అభ్యర్థులు 13, 22 వార్డులలో నామినేషన్లు దాఖలు చేశారు. సీనియర్ నాయకులు కెంచ్ నారాయణ, శివాజీలు నామినేషన్ వేసినట్లు పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ తెలిపారు. నారాయణపేట వార్డుల అభివృద్ధికి మాస్ లైన్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బి.రాము, నాయకులు సయ్యద్ సాజిద్, మహమ్మద్ సలీం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్